మాక్లూర్(నందిపేట్), మార్చి 2: హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడును ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని జక్రాన్పల్లిలో నూతన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని గతంలో పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు.
విమానాశ్రయ ఏర్పాటుతో చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్ జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విమానాశ్రయ ఏర్పాటుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.