యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలను పట్టించుకోలేదు సరికదా.. కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదు. అదే కేసీఆర్ పాలనలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగింది. రాజకీయంగానూ సముచిత స్థానం దక్కిందని బీసీ బిడ్డ, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. గత పాలకులు బీసీలను రాజకీయ వస్తువుగా మాత్రమే చూశారని, కానీ కేసీఆర్ మాత్రం సమస్య లోతుల్లోకి వెళ్లి బీసీలను ఆదుకున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే బీఆర్ఎస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. బీసీల నేస్తం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత వెనుకబడిన వర్గాలదేనని స్పష్టం చేశారు. ఇటీవల నిజామాబాద్‌కు వచ్చిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు చేసిన మేలును, మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన వివరించారు.
నిజామాబాద్, నవంబర్ 8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ బతికు న్నంత కాలం సీఎంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణకు కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో వెనుకబడిన వర్గాల ప్రజల చారిత్రక అవసరమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బీసీలకు సముచితమైన స్థానం దక్కిందని వివరించారు. బీసీలను రాజకీయ వస్తువుగా మాత్రమే గత పాలకులు చూశారన్నారు. కేసీఆర్ మాత్రం సమస్య లోతుల్లోకి వెళ్లి వెనుకబడిన వర్గాలను ఆదుకున్నారని చెప్పారు. ఇందుకోసం రాజీ లేకుండా అనేక సంక్షేమ పథకాలను తీసుకు వచ్చి మేలు చేశారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు తీవ్ర నష్టాలు ఎదుర్కోవడానికి ముఖ్య కారకులు ప్రస్తుత కాంగ్రెస్, బీజేపీలేనని స్పష్టం చేశారు. అవే పార్టీలు తెలంగాణను ఉద్దరిస్తామంటూ ప్రజల ముందుకు కల్లబొల్లి మాటలు చెబుతూ రావడాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో ‘నమస్తే తెలంగాణ’ ముచ్చటించింది. కేసీఆర్ పరిపాలనపై ఆయన అనుభవాలు, బీసీలకు జరిగిన మేలుపై ఆయన చెబుతున్న విశేషాలివీ…
మనం ఒకింటింకి వెళ్లి అన్నం తినొస్తేనే అన్నదాత సుఖీభవ అంటాం. బీసీలందరం ఒకరి సొమ్ము తినం.. ఒకరి చెడును కోరం. మనమంతా సమా జం మేలును కోరుకునేవాళ్లం. అందుకే మనకు లాభం చేసిన కేసీఆర్‌ను మద్దతు తెలపాలి. అన్నంపెట్టిన కేసీఆర్‌కు తిరిగి అధికారం అప్పజెప్పాలి. ఆయనే సీఎంగా రావాలని కోరుకోవాలి. కేసీఆర్ మల్లొక్క సారి సీఎం కావాలి. ప్రజల్లో పట్టున్న నేతలంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు. వేరే పార్టీలో జనంతో సంబంధం లేని వారే ఉన్నారు. వారితో భవిష్యత్తులో ప్రజలకు జరిగే మేలు అంటూ ఏమీ ఉండదు. వేరే రాష్ర్టాల్లో 20, 25 ఏండ్లు ముఖ్యమంత్రులుగా పని చేసిన వాళ్లున్నా రు. అంతకంటే ఎక్కువగా సీఎంగా పని చేసిన వారిని మనం చూస్తున్నాం. కానీ పదేండ్లలోనే… తెచ్చిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక వ్యక్తి కేసీఆర్. ఇలాంటి ముఖ్యమంత్రి దేశం లో మరెక్కడా లేరు. 25 ఏండ్లలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పనిని కేవలం పదేండ్లలో 100 ఏండ్ల అభివృద్ధి చేసి చూపించారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారు. తెలంగాణ వచ్చిన్నాడు మన బడ్జెట్ విలువ రూ.లక్ష కోట్లు లోపే. అలాంటి తెలంగాణ రాష్ర్టాన్ని ఇప్పుడు మూడు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే స్థాయికి కేసీఆర్ తీసుకువచ్చారు. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ కూడా ఇంతగా లేదం టే అతిశయోక్తి కాదు. విజ్ఞులు, మేధావులు, బీసీ ప్రజలంతా ఆలోచన చేయాలి. ఎవరు మంచి చేశా రు. ఎవరి వల్ల కీడు జరిగింది. ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఓటెయ్యాలి. బీఆర్ఎస్కు మద్దతు తెలపాలి.
తెలంగాణ గతంలో ఎట్లుండే. దవాఖానల్లో అడుగు పెట్టే ధైర్యం చేసే వాళ్లమా. ఇప్పుడెట్లుంది తెలంగాణ. ప్రభుత్వ దవాఖాలన్నీ కార్పొరేట్ కన్నా మంచిగా అభివృద్ధి చెందింది నిజం కాదా. ఏనాడైనా మండల కేంద్రాల్లో 30 పడకలు, 50 పడకలు, 100 పడకల వైద్యశాలలను మనం చూశామా? సమైక్య రాష్ట్రంలో మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే దిక్కూమొక్కూ లేకుండేది. పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత, మందుల కొరత తీవ్రంగా వేధించేది. అలాంటిదిప్పుడు వంద పడకల దవాఖానలు కోకొల్లలుగా కట్టించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే కాక మరెవ్వరికి ఉంది. పేదోళ్లకు ప్రాణం సక్కగా లేకపోతే ధైర్యంగా సర్కారు దవాఖానాకే వెళ్తున్నారన్నదే నిజం. కేసీఆర్ పరిపాలనలో వైద్య సాయం పొందుతున్న వారందరి మదిలోనూ కేసీఆర్ ఉన్నారని నేను నమ్ముతున్నాను. విద్యా, వైద్యారోగ్యంలో తెలంగాణ సాధించిన ఘన త చాలా గొప్పది. మొదటి ఐదేండ్ల టర్మ్‌లో ప్రాజెక్టులు నిర్మించారు. వివిధ పథకాలతో రైతుల కళ్లల్లో ఆనందం చూశారు. రెండో టర్మ్‌లో అంతకు రెట్టింపు సంక్షేమ పథకాలు తెచ్చారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. పదేండ్ల క్రితం వడ్లు పక్క రాష్ట్రం నుంచి కొనుక్కునేది. ఇప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు తెలంగాణలో పండిస్తున్నారంటే అందుకు కేసీఆరే కారణం. పండించిన ప్రతి ధాన్యం గింజను కొని రైతులకు మేలు చేస్తున్నారు. రైతు లోకంలో సగానికి ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు. వీరంతా ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. కేసీఆర్ ఏ పని చేసినా అది ఎస్సీ, ఎస్టీ, బీసీ మేలు కోసమే చేశారు.
బీసీలంతా కలిసి కట్టుగా బీఆర్ఎస్ పార్టీకే ఓటెయ్యాలి. ఎందుకంటే సీట్లు ఇయ్యని పార్టీలకు ఎందికియ్యాలి. మనల్ని(బీసీలను)గుర్తించని పార్టీకి ఓటు ఎందుకెయ్యాలి. ఒకాయన బీసీల ను సీఎం చేస్తానంటున్నారు. మీ పార్టీకి మీకున్న బీసీ అధ్యక్షుడిని పీకేశారు. బీసీని పీకేసి ఓసీకి పదవిని కట్టబెట్టారు. బీసీ ప్రధానిగా ఉన్న మీ హయాంలోనే మీ పరిధిలోనే బీసీలకు మంత్రి త్వ శాఖ లేదు. అధికారంలోకి రాలేమని తెలిసి బీసీలకు సీఎం పదవి అంటూ ఎర వేస్తున్నారు. ఇలాంటి మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీకి బీసీలపై ఎలాం టి ప్రేమ లేదు. బీసీల అవసరాలేమి టో, వారికి ఏం చేయాలో ప్రధానికి తెలియదు. కనీసం ప్రణాళిక లేదు. 2001లో నాలుగు కోట్ల మంది ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు కొద్దిమందితో కేసీఆర్ ఉద్యమ బాట పట్టా రు. 14 ఏండ్ల పాటు పోరాటం చేసి ప్రాణాలు తెగించి రాష్ర్టాన్ని తీసుకు వచ్చారు. తెచ్చిన తెలంగాణను బంగారుమయం చేస్తూ అ ద్భుతమైన పాలనను అందిస్తున్నారు. దేశంలో, మిగిలిన ఏ రాష్ట్రంలోనే అమలు కాని విధంగా 24గంటల నిరంతర విద్యుత్ కేవలం తెలంగాణలో మాత్రమే రైతులకు అందిస్తున్నారు. కర్ణాటకలో రైతులకు కరెంట్ ఇస్తామని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నెలల వ్యవధిలోనే చేతులు ఎత్తేసింది. కర్ణాటకలో 6 నెలలకో రాజకీయ అనిశ్చితితో ముఖ్యమంత్రులు మారే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో బీసీ సమాజానికి కొండంత అండగా కేసీఆర్ నిలిచారు. రాష్ట్రంలో సంపద పెంచి పేదలకు పంచడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారు.