కామారెడ్డి, మార్చి 10: జిల్లా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, మహిళల రక్షణ తమకు అత్యంత ప్రాధాన్య అంశమని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన సోమవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారిస్తారన్నారు. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.