Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో నీటి కుంటలో కుర్చోని బీఆర్ఎస్కు చెందిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ నిరసన తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి నుండి కరీంనగర్ జాతీయ రహదారి అయిన స్టేషన్ రోడ్డు లోని పోలీస్ స్టేషన్ ముందు వరద నీరు ఎటు వైపు కుడా వెళ్లకుండా అక్కడే నిలిచి ఉంది. ఒక ప్రధాన రహదారి ఒక కుంట, ఒక చెరువును తలపిస్తూ రహదారి వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ వరద నీటి కుంట వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. కావున ఈ నీటి కుంటతో ట్రాఫిక్ జామై వాహనదారులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇదే దారిలో ఉంది. రోగులు, క్షతగాత్రులు ఎమర్జెన్సీ సమయంలో 108 వాహనం, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు ఇట్టి సమస్యను పరిష్కరించకుంటే అక్కడే దీక్ష చేపడతానని స్పష్టం చేశారు.