నిజామాబాద్ : వడగళ్ల వాన జిల్లా రైతులకు కడగళ్ల మిగిల్చింది. నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన వడగళ్ల వానకు పంట నష్టం వాటిల్లింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి మండలాల్లో ఏపుగా పెరిగిన మొక్కజొన్న నేలమట్టమైంది.
పంట నష్టం వివరాలను సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు. రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దని పరిశీల అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అధికారులు తెలిపారు.