కోటగిరి : విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని, మెనూ ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర కళాశాలను (Minority Residential Boys College ) జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కళాశాలలోని వంటగదిని. కూరగాయలను, సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయా అని కళాశాల ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు సరుకులు ఎవరు సరఫరా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కళాశాల అద్దె భవనంలో కొంత ఇరుకుగా ఉందని , విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రభుత్వ భవనాన్ని ఇప్పించాలని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వారి వెంట కోటగిరి తహసీల్దార్ గంగాధర్ ఉన్నారు.