MLA Pocharam Srinivas Reddy | రుద్రూర్, జులై 14 : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం మోడల్ స్కూల్ ను పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల హాస్టల్ విద్యార్థులకు అందజేసే భోజనాన్ని పరిశీలించి, వసతుల గూర్చి అడిగి తెలుసుకున్నారు.
సరుకుల గడువు తేదీలపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా లక్షలను ఎంచుకొని కష్టపడి చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల లక్ష్య సాధనే ప్రధానంగా విద్యా బుద్ధులు నేర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఇలాంటి సమస్య రాకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సాయిలు, ప్రిన్సిపల్ చిన్నప్ప, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.