ఖలీల్వాడి, జూన్ 16: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ప్రతి సెక్షన్, సబ్ డివిజన్, ఈఆర్వో డివిజన్ ఆఫీసుల్లో, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సర్కిల్ ఆఫీసులో వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సోమవారం బక్రీద్ పండుగ ఉన్నప్పటికీ ప్రజావాణి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.