Banswada | బాన్సువాడ, 8 : Banswada బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రజల సహకారంతో వార్డు ను అభివృద్ధి చేస్తామని 19వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మక్బూల్ సూచించారు. వార్డు పరిధిలో వార్డు సభ ను మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తో కలిసి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలని సమస్యలపై ప్రజలతో చర్చించారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డ్ తదితర అంశాలపై చర్చించారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.