బోధన్, ఏప్రిల్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ల క్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అయినా హామీలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తామని చెప్పినా అవి అర్హులకు అందడంలేదన్నారు. ఇం డ్ల స్థలాలు ఉన్న వారికి పట్టాలు అందిం చి, నిర్మాణాలకు రుణాలు మంజూరు చేస్తామని చెప్పినా వాటి దాఖలాలు లేవన్నారు. రైతులకు రైతు భరోసా మాదిరిగానే ఉపాధికూలీలకు డబ్బులు అందిస్తామని చెప్పినా ఊసే లేదన్నారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని, పింఛన్లను రెట్టింపు చేస్తామని చెప్పి అమలుచేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు బోనస్ అందించడంలో విఫలమైందన్నారు. హామీలను అమలుచేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రజలు సహించబోరని, రాబో యే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతార ని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి జె. శంకర్ గౌడ్, బోధన్ ఏరియా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఏశాల గంగాధర్, దాసి గోపి, పత్రి ఎల్లయ్య, దండు సాయిలు, అలిగే గంగాధర్, బిల్ల నర్సింహులు, నల్ల శ్రీనివాస్, పోశెట్టి, న్యాలం సురేశ్, సావిత్రి, పోచవ్వ తదితరులు పాల్గొన్నారు.