Kotagiri | వీవోఏ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.. బీఆర్ఎస్
ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నారు.
- వీవోఏలను కాంగ్రెస్ మోసం
- కోటగిరి లో వీవోఏల సమ్మెకు బీఆర్ఎస్ నాయకుల మద్దతు
Kotagiri | కోటగిరి, మే 29 : ఎన్నికల హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసిందని, వీవోఏలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి మోసం చేసిందని బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, సమీకుర్, మోరే కిషన్. నజీర్ పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న వీవోఏ ల నిరవదిక సమ్మెకూ కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. వీవోఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు బీఆర్ఎస్ తరుపున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
2023 లో అసెంబ్లీ సాక్షిగా నాటి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీవోఏ ల సమస్యలపై ప్రశ్నించారని, ఆనాడు ప్రశ్నించిన సీతక్క ఇప్పుడు అదే శాఖ సంబంధించిన మంత్రి ఉన్నారని, ఆనాటి సమస్య నేడు గుర్తుకు రావడం లేదా అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీవోఏలకు సేర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ట్యాబ్ తోపాటు నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వారికి సీసీ లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని, రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి విశేష సేవలు అందిస్తున్న వివో ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనియెడల బీఆర్ఎస్ తరపున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవికుమార్, కిషన్, నజీర్, సమీర్ , శంకర్ గౌడ్, కప్ప సంతోష్ ,యోగేష్, ఉమాకాంత్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

