డిచ్పల్లి, నవంబర్1: ప్రభుత్వం కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి అన్ని కాలేజీలు బంద్ చేయనున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఈ మేరకు టీయూ రిజిస్ట్రార్ యాదగిరి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌ను శనివారం కలిసి బంద్‌కు సంబంధించిన మెమోరాండాన్ని అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకూ కాలేజీలు బంద్ ఉంచుతామని అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్‌రెడ్డి, నరాల సుధాకర్ అన్నారు.
కామారెడ్డి, నవంబర్ 1: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం కామారెడ్డిలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని పక్షంలో సీఎం, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.