మెండోరా/భీమ్‌గల్, డిసెంబర్ 23: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలికల హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కె.ఆరాధన శుక్రవారం తెలిపారు. ఈనెల 24 నుంచి 26 వరకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులు ఎస్కె.సమీరా, రిషిక, గంగోత్రిలను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చర్ల లక్ష్మీరాజారెడ్డి, ఉపాధ్యాయులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు పొన్నాల శ్రీనిధి, అన్నారం అనూష రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఎండి.అఫీజుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సదమస్తు రమణ అభినందించారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్, రంగారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలికల హాకీ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారన్నారు. విద్యార్థినులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.