పోతంగల్ ఆగస్టు 24: గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్పడ్డాయి.
గుంతలు పడిన రోడ్డు మీదుగా ప్రయాణం చేయడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వందలాది వాహనదారులు ఈ రహదారుల వెంబడి నిత్యం అష్టకష్టాలు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. రాత్రి వేళలో ప్రమాదాలకు గురైయ్యే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత అదికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.