వినాయక్‌నగర్, సెప్టెంబర్ 20: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్లకు పలు ఠాణాల్లో పోస్టింగ్ కల్పిస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్వోలుగా విధులు నిర్వహించిన ఎస్సైలను పలు కారణాలతో వీఆర్‌కు బదిలీచేశారు. వీఆర్ నుంచి ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో అటాచ్డ్గా పనిచేస్తున్న ఎస్సై గోవింద్‌ను నిజామాబాద్ సీసీఎస్‌కు బదిలీచేశారు.
ఆరో టౌన్లో అటాచ్డ్గా విధులు నిర్వర్తిస్తున్న సిలివేరి మహేశ్, వీఆర్‌లో ఉన్న గంగుల మహేశ్‌కు నిజామాబాద్ సీసీఎస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. వీఆర్‌లో ఉన్న గురుక మహేశ్‌ను నిజామాబాద్ వన్‌టౌన్‌కు, సామ శ్రీనివాస్‌ను సౌత్ రూరల్ సీఐ ఆఫీస్ నుంచి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్సై-2గా బదిలీ చేశారు. వన్‌టౌన్‌కు అటాచ్డ్గా ఉన్న మొగులయ్యను మాక్లూర్ ఎస్సై-2గా, వినయ్‌కుమార్‌ను ఆర్మూర్ పీఎస్‌కు, సైనారావును వీఆర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ విభాగానికి, బీబీఎస్ రాజును వీఆర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి అటాచ్డ్గా పోస్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. పోస్టింగ్ కల్పించిన సిబ్బంది వెంటనే తమకు కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేయాలని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.