ఖలీల్వాడి/నందిపేట్, ఆగస్టు 22: జీవో-97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంతోపాటు నందిపేట్లో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’లో విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, జీవోను వెంటనే రద్దుచేయాలని కోరారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘం నాయకులు పవన్, మహే శ్, హరికృష్ణ, ప్రమోదా, వంశీ, శ్రావ ణ్, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.