వినాయక నగర్ : వేసవిలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య (CP Sai Chaitanya ) సూచించారు. గురువారం నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు ( Eyeglasses ), వాటర్ బాటిళ్లను ( Water Bottles ) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతుందని, ట్రాఫిక్ సిబ్బంది మండుటెండలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఎండ వల్ల, దుమ్ము, ధూళీ కారణంగా కంటికి చల్లదనాన్ని ఇచ్చే కంటి అద్దాలను, తాగేందుకు కూలీంగ్ స్టోరేజీ వాటర్ బాటిళ్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అతినీలోహిత కిరణాల వలన జబ్బు లువచ్చి అనారోగ్యానికి గురి అవుతున్న సందర్భంగా కంటి అద్దాలను సిబ్బంది ప్రతీ ఒక్కరూ ధరించి తప్పక దరించలన్నారు. ప్రజలతో పోలీసు సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. సిబ్బంది ఏదేని ఇబ్బందులు ఎదుర్కొంటే తమ దృష్టికి తీసుకురావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ , సీఐ ప్రసాద్, రవీంద్ర ఫార్మసీ అధ్యక్షులు మధుసూదన్, శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సుధాకర్, సంతోష్, ట్రెజరర్ సాయిలు, మల్లేష్, ట్రాఫిక్ ఎస్సై , ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.