వినాయక్‌నగర్, మార్చి 17: నిజామాబాద్ జి ల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కలకలం సృష్టించింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పలువురు వ్యాపారుల ఇండ్లపై గురువారం దాడులు చేశా రు. అధిక వడ్డీలతో సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్న వ్యాపారుల భరతం పట్టేందుకు సీపీ సాయి చైతన్య ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులోభాగంగా వడ్డీ వ్యాపారుల ఇం డ్లపై మెరుపు దాడులు నిర్వహించారు.
అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అధిక వడ్డీ వ సూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఫైనాన్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మూడు డివిజన్ల పరిధిలో రూ.68.22లక్షల నగదు, 31 ఫైనాన్షియల్, 1435 ప్రామిసరీ నోట్స్, 43 సేల్ డీడ్లు, 30 బాండ్ పేపర్లు, 3 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.