Gurukul school | సిరికొండ, అక్టోబర్ 15 : గ్రామస్తులు అడ్డుకుంటారని ముందస్తు సమాచారంతో పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. ఇది ఇలా ఉండగా. గురుకుల పాఠశాల తరలింపు పై ఇటీవల నాలుగు గ్రామాల ప్రజలు అడ్డుకొని వాహనాలను వెనుతిరిగే ప్రయత్నం చేశారు.
దీంతో తాత్కాలికంగా నిలిచిపోయిన తరలింపు నేడు పోలీస్ బలగాల మధ్య తరలించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి బాత్రూంలు, కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు శుభ్రత గా ఉంచాలని సూచించి వెళ్లిన మరునాడు వెంటనే పాఠశాల తరలింపు పై గ్రామస్తులు మండిపడుతున్నారు.
సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్తులు కావాలని తరలించేటప్పుడు గ్రామస్తుల సలహాలు తీసుకోరాదని మండిపడుతున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం నేడు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉండడంతో పాలకుల కన్నెర్రకు గ్రామం బలైతుందని అంటున్నారు.
సమస్యలని పరిష్కరించడం పోయి పాఠశాల తరలింపు పై ఆంతర్యమేమిటోని చర్చించుకుంటున్నారు. రాజకీయ ఎత్తుగడలతోనే పాఠశాల తరలిస్తున్నట్టు పేర్కొంటున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గురుకుల పాఠశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి నిర్వహించారు. అందులో భాగంగా 2017లో అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో ఎమ్మెల్యే నిధుల నుండి షెడ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ సమస్య అడిగిన సత్వరమే పరిష్కరిస్తూ కొనసాగించారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా గురుకుల పాఠశాలను తరలించిందని చర్చించుకుంటున్నారు.
ధర్పల్లి శివారులో ఓ బీడీ కంపెనీ ప్యాకేజీకి అనుకోని ఉన్న అద్దె భవనం లోకి విద్యార్థులను తరలిస్తున్నారు.అందులో నుండి వచ్చే పొగాకు విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని, అధికారులు బిల్డింగ్ కేటాయించే ముందు పరిసర ప్రాంతాలలో ఉన్న వాటిని చూడటం లేదని ప్రజలు చర్చిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకులు చేసిన చర్య అని అనుకుంటున్నారు.రానున్న స్థానికి సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.నూతన భవన నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానిని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలకు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.