Nizamabad | వినాయక్ నగర్, జూన్ 14 : నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణారెడ్డి ని పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య శనివారం మర్యాదపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు సీపీ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలీస్ కమిషనర్ కు స్వాగతిస్తూ అభినందించారు. అనంతరం వారు జిల్లా పరిస్థితుల పై పలు విషయాలను చర్చించారు.