కోటగిర, జూన్ 10: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పడిన పొతంగల్ మండల కేంద్రంలో శనివారం ‘సుపరిపాలన దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాపతి హాజరయ్యారు. ముందుగా రూ. 2 కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి స్పీకర్ భూమిపూజ చేశారు. అనంతరం స్థానిక సాయిబాబా ఆలయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు అన్ని ర కాల సౌకర్యాలు, మౌలిక వసతులు ఉండేలా పాలనలో సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. తె లంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేశారని అన్నారు.
కొత్త గా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటైనట్లు చెప్పారు. మున్సిపాలిటీలు 62 నుంచి 142కు పెరిగాయన్నారు. 2014 ముం దు బాన్సువాడ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. ప్రస్తుతం తొమ్మిది మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నాయని తెలిపారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు నూతన మండలాలు, పంచాయతీలు ఏర్పాటుచేయడంతో ప్రభు త్వ కార్యాలయాలకు వెళ్లడానికి దూరభారం తగ్గిందన్నారు. సీఎం కేసీఆర్‌కు బాన్సువాడ నియోజకవర్గంపైన ప్రత్యేకంగా ప్రేమ ఉండడంతో నిధులు భారీగా వస్తున్నాయని తెలిపారు. కోటగిరిలో రూ. 14 కోట్లతో 50 పడకల దవాఖాన మంజూరుచేశారని చెప్పారు. ఇంకా అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మంజూరైన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
తగాదాలు పక్కన పెట్టండి.. కలిసి పనిచేయండి
మండల నాయకులు వర్గ విభేదాలు, తగాదాలను పక్కన పెట్టి పొతంగల్ మండల అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. లేకపోతే నష్టపోతామన్నారు. నాయకులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషిచేయాలని సభాపతి సూచించారు.
ఇంటింటికీ భగీరథ జలాలు
తెలంగాణలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉందని, కానీ పక్క రాష్ర్టాల్లో నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్కడ ఇప్పటికీ మహిళలు వ్యవసాయ బోరుబావులు, బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పేదలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు జరుపుకోవడానికి 100 జనరల్ ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో తెలంగాణలో అమలవుతున్న సంక్షే మ పథకాలు లేవన్నారు. అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎంపీసీ వల్లెపల్లి సునీతా శ్రీనివాసరావు, జడ్పీటీసీ శంకర్‌పటేల్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, ఎంపీటీసీ కేశ వీరేశం, పొతంగల్, కోటగిరి విండో చైర్మన్లు శాంతేశ్వర్‌పటేల్, కూచి సిద్ధు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో జానకి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో మ నోహర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కిశోర్‌బాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.