Nagireddypet | నాగిరెడ్డిపేట్, ఆగస్టు 4 : నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రానికి 1.575 టీఎంసీ ఉండినది. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి వరద పెద్ద ఎత్తున ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుండి పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకొని పొంగిపొర్లడం ప్రారంభించింది.
ప్రాజెక్టు కెపాసిటీ 1.820 టీఎంసీ ఉండగా మంగళవారం ఉదయం నాటికి పూర్తి స్థాయిలో నిండుతోంది. ఎక్కువ ప్రాంతాల నుండి 8292 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి రావడంతో ప్రాజెక్టు భారీగా పొంగిపొర్లుతోంది. నాగిరెడ్డిపేట్ మండలానికి పెద్దది క్కుగా ఉన్న పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో నాగిరెడ్డిపేట్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వానాకాలం పంటకు ఎలాంటి ఢోకాలేదని పేర్కొంటున్నారు.