ఎల్లారెడ్డి రూరల్/గాంధారి/పెద్దకొడప్గల్/డోంగ్లీ/ బాన్సు వాడ/బాన్సువాడ రూరల్/బిచ్కుంద/భిక్కనూరు, మే 11: రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్‌గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీల అబద్ధపు, మోసపూరిత హామీలను నమ్మవద్దన్నారు. కారు గుర్తుకు ఓటేసీ జహీరాబాద్ ఎంపీగా గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ప్రచారానికి చివరి రోజు కావడంతో గాంధారితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ రాధాబలరాం, వైస్ ఎంపీపీ భజన్‌లాల్, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డి రాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తఫా, కొమ్మలు రమేశ్, నాగ్లూర్ మల్లేశ్, జింగురు సురేశ్, తూర్పు సంతోష్, పత్తి సాయిలు, రవీందర్, దొల్లు సాయిలు, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, నాయకులు హన్మంత్‌రెడ్డి, గొర్రె శంకర్ మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
డోంగ్లీలో బీఆర్ఎస్ నాయకులు గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. నమూనా బ్యాలెట్‌ను చూపిస్తూ.. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఓంకార్ పాటిల్, నాయకులు విఠల్, వీరన్న, పాషా తదితరులు పాల్గొన్నారు.
నిజంసాగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాద సత్యనారాయణ, గంగారెడ్డి, సిద్ది రాంరెడ్డి, బలరాం, కాశీరాం, లక్ష్మణ్, బాల్‌రెడ్డి, భైరేశ్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, తిర్మలాపూర్, కొత్తాబాది తదితర గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎంపీపీ అశోక్ పటేల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాల్చర్ రాజు, డాక్టర్ రాజు, కలీం పటేల్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సంజు పటేల్, మల్లికార్జున్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరుతోపాటు ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి బోండ్ల సునీల్, యూత్ నాయకులు గంగళ్ల రవీందర్, చంద్రం, రాజు, వేణు, యూత్ నాయకులు పాల్గొన్నారు.