విద్యానగర్, డిసెంబర్ 6 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి వైద్య శాఖ కమిషనర్ శ్వేత, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుం చి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజూ రిజ్వితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెం డో విడుత కంటి వెలుగు కార్యక్రమం పై దిశా నిర్దేశం చేశారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ మీడియా సమావేశం మందిరం నుంచి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల కంటి సమస్యలు తొలగిం చేందుకు సీఎం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని అన్నారు.
రెండో విడుత కార్యక్రమం 2023 జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమర్ధవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో, గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్‌ను పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో జనాభాకు అనుగుణంగా అవసరమైన మేర బృం దాలను సన్నద్దం చేసుకోవాలని గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పని చేయగా, ఇప్పుడు ఈ సంఖ్యను 1500కు పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి టీమ్‌లో ఒక డాక్టర్, అప్తోమెట్రిస్ట్, ముగ్గురు ఆశ వర్కర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒకరు డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు సీహెచ్‌వోలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి రోజు 9 గంటలకు గ్రామాల్లో, వార్డుల్లో శిబిరాలు ప్రారంభించాలని సూచించారు.
శిబిరాలకు అవసరమైన సామగ్రిని జిల్లాకు పంపుతామని అన్నారు. పరీక్షల అనంతరం వెంటనే కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో నూతనంగా 959 డాక్టర్ల నియామకం వారంలో పూర్తవుతుందని అన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాపత్రినిధులు పాల్గొనాలని ఆదేశించారు. జిల్లాలో 5 శాతం అదనంగా కంటి వెలుగు బృందాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి రా ష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మందికి స్క్రీన్ చేయాలనే లక్ష్యంతో ముం దుకు వెళ్లాలని సూచించారు. దీని కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ విషయంపై ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న జనాభాకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు 44 బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారుల సమన్వయంతో షెడ్యూల్ తయారు చేస్తామని చెప్పారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్లు జగ్జీవన్, రమేశ్‌కుమార్, ఆరోగ్యశ్రీ సిబ్బంది పాల్గొన్నారు.