Yoga | పోతంగల్ మే 29:యోగా సాధనతోనే శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని యోగా ఇన్ స్ట్రక్టర్ లు సత్తిష్ గౌడ్, జ్యోతి అన్నారు. అంతర్జాతీయ యోగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలు వేయించారు.
ప్రజలకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానంగా నిర్వహిస్తున్న యోగాకేంద్రాన్ని మండల ప్రజలు సద్వినియోగించుకోవాలని తెలిపారు. మండలకేంద్రంలోని ఆరోగ్య కేంద్రములో ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగా, ఆసనాలు అభ్యాసనం చేస్తున్నామని, దీంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ ఆసనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఉదయం సాయంత్రం మండల ప్రజలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రమణి, శాంత, రేష్మ తదితరులు పాల్గొన్నారు.