నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో బతుకమ్మ వేడుకలు (Bathukamma celebrations) ఘనంగా జరిగాయి.
వాడవాడలో మహిళలు రంగురంగుల బతుకమ్మలను పూలతో అందంగా పేర్చి బతుకమ్మలాట ఆడారు. ఇంట్లో పూజలు నిర్వహించి ఇంటి ముందర, వీధుల్లో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటు పాడారు. అనంతరం సమీపంలోని చెరువులు, వాగులు, వంకల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.