ఇందన కష్టాలు.. బంకుల చుట్టూ వాహనదారుల చక్కర్లు
ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా ఇంధన కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా రెండు మూడు రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
- దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు
- పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు
- వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం
మోర్తాడ్/కామారెడ్డి, ఏప్రిల్ 28: ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా ఇంధన కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా రెండు మూడు రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దీంతో వినియోగదారులు ఇంధన కొరత లేని బంకుల్లో బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. నెల రోజుల క్రితం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఇంధన కొరత ఉండేది. ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలో సద్దుమణిగింది. ఇప్పుడు కేంద్రం పెట్రో ధరలను పెంచుతున్నదనే ప్రచారం జరగడంతో మళ్లీ ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు ఉంచడంతో వాహనదారులు క్యూలు కట్టి ఫుల్లుగా పోయించుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం గమనార్హం. కొందరు బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్‌ను తీసుకెళ్తున్నారు.
వ్యవసాయ పనులపై ‘డీజిల్ కొరత’ ప్రభావం
యాసంగి సీజన్ ముగియడంతో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో డీజిల్ కొరత ఏర్పడడం ఆందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా వరి కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ ఎక్కువగా ఉన్నది. దీంతో డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డీజిల్ కొరత కారణంగా వరికోత యంత్రాల యజమానులు ధరలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు వానాకాలం పంటలకు దుక్కిదున్నే పనులు, సేంద్రియ ఎరువులు, చెరువుల మట్టి తరలింపు తదితర పనుల్లో ట్రాక్టర్లు బిజీబిజీగా ఉంటున్నాయి. ఈనేపథ్యంలో డీజిల్ కొరత వల్ల చాలా వరకు పనుల్లో ఆటంకం కలుగుతున్నది. కమ్మర్‌పల్లిలో రెండురోజుల పాటు డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ప్యాసెంజర్ ఆటోలు నడిపేవారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీజిల్ రాగానే పెట్రోల్ బంక్ యజమానులు వాట్సాప్ గ్రూపుల్లో డీజిల్ వచ్చిందని మెస్సేజ్‌లు చేయడంతో వాహన దారులు బారులు తీరారు. క్యాన్లలో సైతం డీజిల్‌ను తీసుకెళ్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

