cyber crimes | పెద్ద కొడపగల్, మే 04: సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండలంలోని అంజని చౌరస్తాలోని జాతీయ రహదారి 161 పై ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్ఐ మహేందర్ ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ సామాజిక మధ్యమాల్లో వచ్చే మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉచితలకు ఆశపడి మోసపోవద్దన్నారు. ఫోన్ కు వచ్చిన ఓటీపీలు ఎవరికి చెప్పరాదన్నారు.
ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వాడాలన్నారు. మొబైల్ ఫోన్కు రక్షణగా పౌచ్ ఏవిధంగా వాడుతారు తలకు కూడా రక్షణగా హెల్మెట్ ధరించాలని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం సేవించి వాహన నలుపు నడప రాదని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వెంకటేష్, అంజి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.