Leopard | లింగంపేట్, ఫిబ్రవరి 10: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కంచిమల్ గ్రామ శివారులో సోమవారం రాత్రి చిరుత సంచారం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. పలువురు భవానిపేట గ్రామ వాసులు కారులో గాంధారి వైపు వెళ్తుండగా గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద చిరుత కనిపించినట్లు తెలిపారు. చిరుత సంచారం వల్ల రాత్రిపూట పంటపొలాల వద్దకు వెళ్లడానికి రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎండలు మొదలు కావడంతో కంచుమాల్ గ్రామ శివారులోని కుంటలో చిరుత తాగునీటి కోసం వచ్చి ఉంటుందని చెబుతున్నారు. కనుక, అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు