పోతంగల్ మే 6: మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రక్కన గల మురుగు కాల్వలు బురదతో పేరుకుపోయి గడ్డి, పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా తయారయ్యాయి. మురుగు నీరు పారడం లేదు. నెలలు గడుస్తున్నా పంచాయతీ అధికారులు మురుగు కాలువలు శుభ్రం చేయించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇండ్లలోకి దుర్వాసన వెదజల్లుతోందని, కాలువలు శుభ్రం చేయకపోవడంతో రాత్రిపూట దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Sonu Nigam | కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపిన సింగర్ సోనూనిగమ్
KTR | దొంగను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ధ్వజం