Yashoda Hospital | నిజామాబాద్ ఖలీల్ వాడి : పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీబీఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు. పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదడు వ్యాధి అని, ఇది లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి ప్రతీ లక్ష జనాభాకు 15 నుండి 43 కేసుల మధ్య ఉంటుందని అంచనా వేశారు.
జీవన దీర్ఘత్వం పెరుగుతుండడంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. డీబీఎస్ ద్వారా ధీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను అరికట్ట వచ్చాన్నారు. డీబీఎస్ మెదడులో రెండు వైపులా చికిత్స చేయగలదని, ఇది రెండు అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయాకమన్నారు. ఈ సమావేశంలో వైద్యులు ప్రసాద్, రుక్మిణి పాల్గొన్నారు.