Kotagiri | కోటగిరి, జనవరి 23 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రెగ్యులర్ గా రావాలని కోటగిరి సర్పంచ్ బర్ల మధూకర్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్-అధ్యాపకుల అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా సర్పంచ్ బర్ల మధుకర్ మాట్లాడుతూ కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు సౌకర్యార్థం అన్ని రకాల సౌకర్యాలు, వసతులు ఉన్నాయని చెప్పారు.
విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు వచ్చి శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని, విద్యార్థులు కళాశాలకు రెగ్యులర్ గా వచ్చేందుకు తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. పేరెంట్స్ కూడా కళాశాలకు అప్పుడప్పుడు వచ్చి విద్యార్థుల మార్కులు, హాజరు శాతంపై ఆరా తీయాలన్నారు. కళాశాలకు పేరెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటే విద్యార్థుల నడవడికను గమనించవచ్చన్నారు.ప్రస్తుతం ప్రాక్టికల్ కొనసాగుతున్నాయని మరో నెల రోజుల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఉంటాయన్నారు.
కావున విద్యార్థులు కళాశాల కు క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వచ్చి బాగా చదువు కొని వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కైసర్ పాషా, అధ్యాపకులు ప్రమోద్, దత్తాత్రి, అనిల్, ప్రభాకర్, రాము, శ్రీలత, సమీర్, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు.