శక్కర్‌నగర్, డిసెంబర్ 12 : బోధన్ పట్టణం శివారులోని పసుపువాగు ఒర్రెలో కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహాన్ని గుర్తించిన వ్యక్తి సో మవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించాడు. మృతహాన్ని పరిశీలించిన పోలీసులు, సెప్టెంబర్ 22న అదృశ్యమైన బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ పటేల్ (20) అనే విద్యార్థిదిగా ని ర్ధారించారు. సంఘటనా స్థలంలో లభ్యమైన బ్యాగు, చెప్పులు, మృతదేహం ఒంటిపై ఉన్న టీషర్టు ఆధారం గా శ్రీకాంత్ తల్లిదండ్రులు మృతదేహం తమ కుమారు డిదేనంటూ బోరున విలపించారు.
శ్రీకాంత్ మృత దేహం కుళ్లిన స్థితిలో ఉండగా, అతని ప్యాంటుకు వేసుకున్న బెల్టు చెట్టు కొమ్మకు ఉంది. చెట్టు కొమ్మకు ఉరివేసుకున్నట్లు కనిపించినా, అంతఎత్తుకు ఎలా వెళ్లాడనేది అనుమానంగా కనిపిస్తోందని అతని కుటుంబీకులు ఆ రోపిస్తున్నారు. చెట్టు పైభాగంలో శ్రీకాంత్ బ్యాగు, చెప్పులు ఉన్నాయి. సంఘటనా స్థలానికి డాగ్‌స్కాడ్ ను రప్పించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమ కుమారుడు ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడంటూ సెప్టెంబర్ 22న అయిదుగు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి శ్రీకాంత్‌ను చంపేస్తామని బెదిరించారని, ఆ రోజు రాత్రి తమ కుమారుడు ఇంటికి రాలేదని, ఈ విషయమై స్థానిక పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామని తల్లి జ్యోతి, తండ్రి లక్ష్మణ్పేట్ సోదరుడు తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే సదరు యువతి కుటుంబీకులు శ్రీకాంత్‌ను హత్య చేశారని వారు ఆరోపించారు. బెదిరించిన వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే సదరు వ్యక్తులతోనే ఓ పోలీసు అధికారి మందు సేవించాడని, వారితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
ఉదయం నుం చి మధ్యాహ్నం వరకు శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువులు బోధన్- రుద్రూర్ రహదారిపై రాస్తారోకో చేశా రు. సంఘటనా స్థలాన్ని డీసీపీ అరవింద్‌బాబు, బోధ న్ ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ బీడీ ప్రేమ్‌కుమార్, రూరల్ సీఐ శ్రీనివాస రాజు, రుద్రూర్ సీఐ జాన్‌రెడ్డి, ఆర్డీవో పరిస్థితులను పర్యవేక్షించారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం : డీసీపీ
ఆందోళన స్థలం వద్దకు వచ్చిన డీసీపీ అరవింద్‌బాబు వారితో మాట్లాడారు. ముందుగా పోస్టు మార్టానికి అనుమతించాలని, ఇందులో వాస్తవాల ఆధారంగా కేసులు నమో దు చేయిస్తామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని అన్నారు. బోధన్ పోలీసులపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీపీ ఇతర పోలీసు అధికారులతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పోస్టు మార్టం కోసం మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లను రప్పించారు. విద్యార్థి సంఘాల నాయకులు, పలు పార్టీల నాయకులు శ్రీకాం త్ కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.