Manda krishna | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కారం అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచ్చిరాం ఆధ్వర్యంలో గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం జరిగేంత వరకు పోరాట పట్టిన ఉన్న ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు.
ఈ నెల 27న ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో భారత రాష్ట్రపతి గౌరవ ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును మందకృష్ణ మాదిగ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, టపాసులు బాణ సంచాలు కాల్చారు అనంతరం సీట్లు పంచుకున్నారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయం గుర్తించి తమ జాతికి వివరిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీకాంత్, కన్నం శ్రీనివాస్, దినేష్, దావులయ్య, కన్నం సాయిలు, బీ సాయిలు, సాయినాథ్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.