కాంగ్రెస్ పార్టీ తీరుపై బడుగులు భగ్గుమంటున్నారు. కుల గణన, రిజర్వేషన్లు సహా అనేక హామీల అమలులో మోసం చేసిన అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికలకు ముందు డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. అదే క్రమంలో బీసీలను సైతం మచ్చిక చేసుకునేందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే అమలు చేస్తామని మాట ఇచ్చిన హస్తం పార్టీ 15 నెలలు దాటినా అమలు చేయకుండా ఢోకా చేసింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికిన రేవంత్‌రెడ్డి వారి ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వారికి రిజర్వేషన్లు ఇవ్వకుండా ‘చేయి’చ్చారు. చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామన్న రేవంత్‌రెడ్డి.. 42 శాతం రిజర్వేషన్ పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని, అక్కడ ఒప్పుకుంటేనే అమలు చేస్తామని మెలిక పెట్టడంపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. 15నెలలుగా ఆశ పెట్టి ఇప్పుడు చేతులెత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించి అధికారం దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అలవి కానీ హామీలెన్నో ఇచ్చింది. అందులో భాగంగానే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి కుల గణన చేస్తామని, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బడుగులను నమ్మించింది. కానీ, ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయకుండా మోసగించిన తరహాలోనే కాంగ్రెస్ బీసీల ఆశలపై నీళ్లు చల్లింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చేతులెత్తేయడం వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పాలనలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించినా కేంద్రం నుంచి ఏ ఒక్క దానికీ అనుమతి రాలేదు. ఇప్పుడు రిజర్వేషన్ల తీర్మానాన్ని కూడా కేంద్రం ఆమోదించదని తెలిసే రేవంత్ సర్కారు కొత్త నాటకానికి తెర తీసిందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఆమోదించకపోతే తామేమీ చేయలేమని తప్పించుకోవాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడ అని వెనుకబడిన వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ చెప్పినట్లు రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్, కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు, బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20 లక్షల కోట్ల కేటాయింపు, ప్రతి మండలంలో బీసీ గురుకులాలు, మున్నూరుకాపులు, ముదిరాజ్‌లు సహా మిగతా బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా వదలబోమని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు.
వాస్తవానికి కుల గణన చేపట్టే అధికారం కేంద్రానికే ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళా రాష్ర్టాలు చేసినా ఆ గణంకాలకు చట్టబద్ధత ఉండదని, అమలు చేసే అవకాశం కూడా లేదని గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ కుల గణన అంటూ హడావుడి చేయడం, రిజర్వేషన్లు అంటూ ఊదరగొట్టడం కుట్రలో భాగమేనని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా కులగణన సమయంలో చాలా ఇండ్లకు ఎన్యుమరేటర్లు రాలేదని, మొక్కుబడిగా సర్వే ముగించారని మండిపడుతున్నాయి. తాజాగా ప్రకటించిన కులగణన నివేదిక వివరాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. పదేండ్లలో తెలంగాణలో పెరిగిన జనం కేవలం 2 లక్షలేనని చెప్పడం, బీసీ జనాభా పెరుగుదల 11.4 లక్షలే అనడం, ఎస్సీలు తగ్గిపోవడం, అగ్రకులాల జనాభా పెరిగనట్లు చూపడం వంటివి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కుల గణన, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తీరు బీసీ వర్గాలను కావాలనే మోసం చేస్తున్నదని బడుగు బలహీనవర్గాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

జనగణన పేరిట బీసీ వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ప్రభుత్వం ప్రకటించిన గణంకాలే చెప్తున్నాయి. కుల గణన తప్పుల తడకగా ఉందని, ప్రామాణికత లేకుండా సర్వే చేశారన్నది స్పష్టమవుతున్నది. 42 శాతం మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పడంలో కుట్ర దాగున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నది.
కామారెడ్డి, వరంగల్ లో ప్రకటించిన డిక్లరేషన్ సభల్లో మీరు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి? బీసీ డిక్లరేషన్ సభలని చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి ఇప్పుడు బీసీల గొంతు నొక్కుతుండ్రు. ప్రభుత్వం ప్రకటించిన బీసీల లెక్కల్లో తప్పులున్నాయి. బీసీలకు ఎక్కడా న్యాయం జరుగుతలేదు. బీసీలంతా ఏకం కావాలె. బీసీ డిక్లరేషన్ సభల్లో చెప్పిన హామీలన్నీ అమలయ్యే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలె. బీసీలకిచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ సర్కారును నిలదీయాలె.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మస్తు హామీలిచ్చింది. డిక్లరేషన్ల పేరిట సభలు పెట్టి వరాలు కురిపించింది. వంద రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పింది. రైతులు, బీసీ ల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు అన్ని హామీలు అమలు చేయాలి. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. స్థానిక సంస్థల్లో చెప్పినట్లుగానే కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. హామీల అమలులో కాంగ్రెస్‌కు నిబద్ధత లేదు. బీసీల విషయంలోనైనా చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
కామారెడ్డి సభలో బీసీలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గుతున్నట్లుగానే అనిపిస్తున్నది. రిజర్వేషన్ల అమలులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతున్నది. రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆమోదం తెలపాలనే కొత్త నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తేవడం సర్కారు చిత్తశుద్ధిపై అనుమానాలకు తావిస్తున్నది. కుల గణనపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బీసీల జనాభా తగ్గుడేందో అర్థమైతలేదు. దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు ఇవ్వాలి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే. బీసీల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలి.