Pothangal | పోతంగల్, పిబ్రవరి 20 : మన ఇసుక వాహనం ఆన్లైన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పోతంగల్ మండలంలోని హంగర్గ మంజీర లో స్థానిక నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇసుక అవసరమున్న వినియోగదారులు మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకొని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉదయ్ భాస్కర్, ఉప సర్పంచ్ గోపి, కార్యదర్శి గంగారాం, జీపీవో నరేష్, మాజీ సర్పంచ్ గంగారాం, సర్వేయర్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు.