రాంచీ: జార్ఖండ్(Jharkhand)లో ప్రత్యేక ఓటర్ల సవరణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సర్ లో రికార్డు నమోదు అయ్యింది. మృతి చెందిన ఆరు లక్షల ఓటర్లు.. ఓటర్ల జాబితాలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. శనివారం వరకు ఆ సంఖ్య నమోదైందన్నారు. రాంచీలో అత్యధికంగా డెడ్ ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. జూన్ 30వ తేదీన జార్ఖండ్లో సర్ ప్రారంభమైంది. జూలై 29 వరకు సర్ ప్రక్రియను నిర్వహించనున్నారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్లను వెరిఫై చేస్తున్నారు. రాంచీలో సుమారు 71,990 మంది డెడ్ ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత కుంతిలో 53,885 మంది మృతిచెందిన ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. జార్ఖండ్లో 2.64 కోట్ల ఓటర్లు ఉన్నారు. దీంట్లో 99.58 శాతం మందిని బీఎల్వోలు చేరుకున్నట్లు తెలిసింది.