Banswada | బాన్సువాడ, జులై 16 : దివ్యాంగుల సౌకర్యార్థం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని సదరం కేంద్రంలో సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయ భాస్కర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు రెండుసార్లు సదరం సేవలు అందిస్తారని తెలిపారు. ఇప్పుడు అంగవైకల్యం, పక్షవాత రోగులకు సదరంలో సేవలు అందుతాయని పేర్కొన్నారు.
భవిష్యత్లో మరిన్నీ సేవలను విస్తరిస్తామని చెప్పారు. బాన్సువాడ సుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో 15 మంది కి 13 మంది హాజరై వైకల్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వైద్యులు ప్రవీణ్, సాయిలు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్, ఆర్ఎంవో సుజాత, ఉద్యోగులు అమృత, సురేష్, సంధ్య, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.