రుద్రూర్, ఆగస్టు 25: రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు విద్యాబోధన జరుగుతున్నది. ఈ పాఠశాలలో సుమారు 80మంది విద్యార్థులు చదువుతుండగా పాఠాలు బోధించేందుకు మాత్రం ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో ఎనిమిది తరగతుల విద్యార్థులను ఎలా క్రమశిక్షణలో పెట్టాలో అర్థం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కనీసం విద్యావలంటీర్లను నియమిస్తే విద్యాబోధనలో కృషి చేసేందుకు మంచి అవకాశం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సరిపడా తరగతి గదులు, సౌకర్యాలు ఉన్నా చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గింది. ఈ విషయమై ఎంఈవో నాగ్నాథ్ను వివరణ కోరగా డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ అయితేనే ఉపాధ్యాయుల కొరత తీరుతుందని, తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపిస్తున్నట్లు చెప్పారు.