కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్- 17 బాలుర కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా సోమవారం మొత్తం 16 జట్లు పోటీపడ్డాయి.ఇందులో కేరళ వర్సెస్ ఉత్తరప్రదేశ్ మధ్య పోటీ జరగగా 12 పాయింట్లతో ఉత్తరప్రదేశ్ గెలుపొందింది.
హిమాచల్ ప్రదేశ్ వర్సెస్ కర్ణాటక పోటీ పడగా 8 పాయింట్లతో కర్ణాటక విజయం సాధించింది. తెలంగాణ వర్సెస్ ఉత్తరఖాండ్ పోటీ పడగా మ్యాచ్ టైగా ముగిసింది.కేంద్రీయ విద్యాలయం వర్సెస్ ఢిల్లీతో పోటీపడగా 14 పాయింట్ల తో ఢిల్లీ విజయం సాధించింది.