Nizamabad | రుద్రూర్ జూన్ 13: మత్తు పదాల ద్వారా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని, నేడు యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. Cp సాయి చైతన్య ఆదేశానుసారం రుద్రూర్, వర్ని మండల కేంద్రాల్లో బస్టాండ్ సమీపంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన సదస్సుతోపాటు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వర్ని చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ మాదకద్రవ్యాల వాడకం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని, సమాజంలో మాదకద్రవ్యాల వాడకం నిర్మూలించే విధంగా ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో అన్నిచోట్ల యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు.
గంజాయి, మత్తు పదార్థాల వాడకం పై సమాచారం ఉంటే 1908 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలోరుద్రూర్ ఎస్సైసాయన్న, వర్ని ఎస్సై తో పాటు సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.