Dhrapalli | ధర్పల్లి, జూన్ 6 : ధర్పల్లిమండలంలోని రేకులపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా గేదె మృతి చెందింది ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట నరసయ్య అనే గేదెల కాపరి గేదెలను తీసుకొని మేపుతుండగా ఒక గేదకు విద్యుత్ వైరు తగిలింది.
ఈ ప్రమాదంలో ఆ గేదె కొట్టుకుంటుండగా విద్యుత్ వైరుని పక్కకు లాగి గేదెను కాపాడబోయాడు. ఈ ఘటనలో అతడికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ సంఘటనలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక సర్పంచ్ రాజేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.