BJP | రుద్రూర్/లింగంపేట్ : ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రావు, రుద్రూరు మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ కోరారు. రుద్రూరు, లింగంపేట మండల కేంద్రాల్లో శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం పై భారం తగ్గి అభివృద్ధి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై బీజేపీ కార్యకర్తలందరూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శత జయంతి ఉత్సవాల కన్వీనర్ ప్రశాంత్ గౌడ్, కో-కన్వీనర్ కుమ్మరి గణేష్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, దళిత మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, జీలకర్ర విజయ్, బోజిగొండ అనిల్, మండల కమిటీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
లింగంపేటలో మాట్లాడుతున్న వెంకట్రావు
లింగంపేట మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు మహారాజుల మురళి, బీజేపీ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, బీజేవైఎం మండల అధ్యక్షులు రజనీకాంత్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు అధ్యాల ఉదేష్, కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు చేపూరి పోశెట్టి, లింగంపేట పట్టణ అధ్యక్షులు తిరుమల నరేష్, బూత్ అధ్యక్షులు విష్ణు, భీమయ్య, గణేష్, రాజారాం, సాయిలు, ముకుంద రెడ్డి, భాస్కర్ రెడ్డి, దాసరి సాయిలు, దురిశెట్టి రవి, సంతోష్, నారాయణ, లెగ్గేల రాజు, మేదరి ప్రసాద్, సంతోష్, భాజ సంతోష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.