బీబీపేట్/మాచారెడ్డి, సెప్టెంబర్ 2: ఎడ్లకట్టవాగు ఉధృతికి గల్లంతైన ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. పాల్వంచ మండలం మథనిదేవుపల్లికి చెందిన కామిటి నర్సయ్య (60) భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఉండే కూతురి ఇంటికి ఆదివారం వెళ్లాడు.
రాత్రి బీబీపేటకు వచ్చే క్రమంలో మాందాపూర్ శివారులో ఎడ్లకట్టవాగును దాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. సోమవారం ఉదయం వాగు ఒడ్డున నర్సయ్య మృతదేహం తేలడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డికి తరలించారు.
చేపల వేటకు వెళ్లి లచ్చాపేట గ్రామశివారులోని వాగులో ఆదివారం గల్లంతైన కైరంకొండ శివరాములు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రిస్క్యూ టీం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. అటు ఎగువ మానేరులోనూ గంభీరావుపేట పోలీసులు గాలిస్తున్నారు.