కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును రద్దు చేసి, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి, 24లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.