Nova Hospital | ఖలీల్ వాడి నిజామాబాద్ 18: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 ఆపరేషన్లు విజయవంతమైనందున చికిత్స పొందిన బాధితులతో గెట్టుగెదర్ని ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాలు, దీప మాలు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా రోబోటిక్ నూతన టెక్నాలజీ తో 200 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కీళ్ల మార్పిడీ, జనరల్ శాస్త్ర చికిత్సలు జనరల్ చికిత్స విభాగం, వైద్య నిపుణులు, నెఫ్రాలజీ విభాగంలో అత్యంత సేవలు అందించడంలో వైద్యుల పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు.
గెట్ టుగెదర్ పెట్టగానే చికిత్స చేయించుకున్న బాధితులు రావడం, ఆటపాటలతో అందర్నీ అలరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. వారితోపాటు డాన్సులు వేయడం నాకు ఎంతో బాధ్యతను గుర్తు చేసిందని అన్నారు. ఇంతటి ఆనందానికి కారణం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్కు వెళ్లకుండా నోవా ఆసుపత్రిలోనే అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేస్తున్నట్లు చెప్పారు. నిరుపేద ప్రజలకు ఖర్చు ఎక్కువ కాకుండా చికిత్స వారి బడ్జెట్ తగ్గట్టుగా చేసి వారికి అండగా నిలబడడమే నోవా ఆసుపత్రి యొక్క లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ కంటే నోవా ఆస్పత్రిలోనే అత్యుత్తమ నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేస్తున్నారని బాధితులు చెప్పడం ఎంతో సంతోషం అనిపించిందని పేర్కొన్నారు.