కంటేశ్వర్ (నిజామాబాద్) : బీజేపీ(BJP) దళిత, బహుజన వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్ (Raja Narendra Goud) ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు (BCs) రాజకీయంగా ఎదగడం బీజేపీకి ఇష్టం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన కుల గణన సర్వేపై విషప్రచారానికి తెర లేపిందని , ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్ర ప్రజలు వారి మాటలు పట్టించుకునే పరిస్థితులలో లేరని వెల్లడించారు. బీజేపీ ఆవిర్భావం నుంచి బీసీలను, దళితులను రాజకీయంగా, సామాజికంగా , ఆర్థికంగా అణగదొక్కుతూ వస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేసి (BC Clasifications, ) రాజకీయ, ఆర్థిక ,సామాజిక స్వేచ్ఛను కల్పిస్తుంటే ఆ పార్టీ నాయకులకు మింగుడు పడలేకపోతున్నారని పేర్కొన్నారు. బీసీలు, దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగితే వారి మనుగడ ప్రశ్నార్ధకమవుతుందనే ఉద్దేశంతో కులగణన నివేదికను ప్రజలలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.