నిజామాబాద్, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తరతరాలుగా అణిచివేతకు గురైన తెలంగాణకు విముక్తి ప్రసాదించినది టీఆర్ఎస్. అలుపెరగని పోరాటాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేయించినది టీఆర్ఎస్. ఎత్తిన జెండా దించకుండా, ప్రాణాలకు తెగించి కొట్లాడి స్వరాష్ర్టాన్ని సాకారం చేసిన ఘనత గులాబీ జెండాది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని సాకారం చేస్తూ బంగారు తెలంగాణ సాధనలో నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలుపెరగని సేవలు అందిస్తున్నారు.
దేశ రాజకీయ చిత్రపటంలో టీఆర్ఎస్ సాధించిన ఘనతలు అనే కం. 2001లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఏప్రిల్ 27 నాటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుని సగర్వంగా 22వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. ద్వి దశాబ్ది ఉత్సవాలను గతేడాది చివర్లో అట్ట హాసంగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించినప్పటికీ, పలు ఎన్నికల కారణంగా కోడ్ అమల్లోకి రావడంతో విజయ గర్జన కార్యక్రమం వాయిదా పడింది. తదనంతరం వస్తోన్న 2022, ఏప్రిల్ 27ను పార్టీ ముఖ్య నాయకులతో ప్లీనరీ సమావేశం నిర్వాహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితులను ప్లీనరీకి పిలుస్తున్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో తలపెట్టిన ఈ ప్లీనరీకి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల నేతృత్వంలో సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి.
పండుగలా వేడుక..
హైదరాబాద్‌లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి దాదాపుగా 300-400 మందికి ఆహ్వానం అందే అవకాశముంది. ప్లీనరీలో ఎవరెవరు పాల్గొంటారనే విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. పరిమిత సంఖ్యలోనే ఆహ్వానాలు పంపుతున్నట్లు వెల్లడించారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా గ్రంథా లయ సంస్థల చైర్మన్లు, మహిళా కో-ఆర్డినేటర్లను ప్లీనరీకి ఆహ్వానిస్తు న్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరికొంత మందిని పిలువనున్నారు. ఆహ్వానితులకు మాత్రమే పాసులు ఇస్తారు. ఆహ్వానం లేని వారికి ప్రవే శం ఉండదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయించింది. రెండు దశాబ్దాలు దాటిన టీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఘనంగా చాటి చెప్పేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఊరూరా జెండావిష్కరణలు..
టీఆర్ఎస్ ప్లీనరీ(ప్రతినిధుల) సభకు పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితు లు ఉండటంతో గ్రామ, వార్డు(డివిజన్) స్థాయిల్లో ఏప్రిల్ 27న పెద్ద ఎత్తున గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. గ్రామ కమిటీలు, వార్డు కమిటీ బాధ్యుల ద్వారా ఊరూరా జెండా ఎగు రవేసేలా ప్రణాళిక రచించారు. ప్లీనరీకి హాజరు కాని నేతలంతా ఎక్కడి కక్కడ జెండావందనం చేపట్టాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సంస్థాగతంగా గులాబీ పార్టీ పకడ్బం దీగా బలోపేతమైంది. ఈ మేరకు 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బస్తీ, గ్రామ, మండల, డివిజన్ కమిటీలను ప్రకటించింది. జిల్లా, రాష్ట్ర కమిటీలతో పాటు అనుబంధ సంఘాలను నియమించారు. పార్టీయే సర్వస్వంగా పని చేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా శ్రేణులు ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు అప్పగించింది.
ప్లీనరీ ఉత్సాహం..
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతినిధుల సభకు ఏర్పాట్లు జరుగుతుండటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. ప్లీనరీకీ హాజరయ్యేందుకు ముఖ్య నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాల మధ్య స్వరాష్ట్ర సాధనకు కదిలిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రజలు అడుగడుగునా కొండంత అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తలపెట్టిన ఉద్యమాల్లో కేసీఆర్ పిలుపును అందుకుని ప్రజలంతా రోడ్లపైకెక్కి ఉద్యమించారు. ఉమ్మడి రాష్ట్ర పరిపాలకులను అడుగడుగునా నిలదీశారు. భారత ప్రభుత్వాన్ని ఒప్పించి స్వరాష్ర్టాన్ని సాధించగలిగారు. ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్షకు దిగి కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించిన ఘనత కేసీఆర్‌దే. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుటిల ప్రయత్నాలను బద్దలు కొట్టి 2014లో విజయ తీరాలకు చేర్చారు. కొద్ది మంది వ్యక్తులతో రాష్ట్ర సాధన కోసం కదిలిన కేసీఆర్ వెంట లక్షలు, కోట్లాది మంది అండగా నిలిచారు. 14 ఏండ్ల ఉద్యమంలో, ఎనిమిదేండ్ల పరిపాలనలో ప్రజలు కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉంటూ ఆదరిస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరసనలతో ప్రజల్లోకి టీఆర్ఎస్ పార్టీ చొచ్చుకెళ్లింది. నేడు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న అధికార పార్టీగానూ అనేక విధాలుగా దగ్గరైంది.