ఇందల్వాయి, జూన్ 25 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముగింట్లోకి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్‌తో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. రూరల్‌లోని నాయకుల కోరిక మేరకు మంచిప్ప రిజర్వాయర్ నుంచి లక్షా 25 వేల ఎకరాలకు నీరందించే నూతన ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రైతువేదిక ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నాయకులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్‌నాయక్, జడ్పీటీసీ గడ్డం సుమనా రవిరెడ్డి, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, నాయకులు పాశం సత్తెవ్వ, మోహన్‌నాయక్, నరేశ్, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, మారంపల్లి సుధాకర్,శ్రీనివాస్‌గుప్తా, పాశం కుమార్, పులి సాగర్, చిలువేరి దాసు, మొచ్చ గోపాల్, చిన్న ముత్తెన్న, రాజేందర్, చింతల దాసు, బీరీష్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ నయీముద్దీన్ కరోనా బారిన పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.