e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home కామారెడ్డి ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

ఉత్సాహంగా హరితహారం

నిజామాబాద్‌ రూరల్‌/కోటగిరి/ధర్పల్లి, జూలై 13 : హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. మండలంలోని పాల్ద, తిర్మన్‌పల్లి గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ ఆవరణలో 70, ఆయా గ్రామాల్లో 900 మొక్కలు నాటారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ మాధవ్‌రెడ్డి, సర్పంచులు సుప్రియ నవీన్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ ఆమనీనరేశ్‌, స్పెషల్‌ ఆఫీసర్‌, ఏవో హీరాజాదవ్‌, సీఈవో సునీల్‌రెడ్డి, సహకార క్లస్టర్‌ అధికారి మురళి, ఏఆర్‌వో దేవకళ, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.కోటగిరి మండలం సుంకినిలో సర్పంచ్‌ మాధవ్‌రావు ఉపసర్పంచ్‌ దిగంబర్‌పటేల్‌, ఎంపీటీసీ సాయిలుతో కలిసి మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటిన అనంతరం ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలని సర్పంచ్‌ సూచించారు.ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రతి దుకాణం ఎదుట మొక్కలు నాటాలని గ్రామపంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ గంగదాస్‌ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్రతి దుకాణానికి ఒక మొక్కతోపాటు ట్రీగార్డును అందజేస్తామన్నారు. సర్పంచ్‌ ఆర్మూర్‌ పెద్ద బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానించినట్లు వ్యాపారులకు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉత్సాహంగా హరితహారం
ఉత్సాహంగా హరితహారం
ఉత్సాహంగా హరితహారం

ట్రెండింగ్‌

Advertisement